MLA Rapaka: సీఎం జగన్‌ను కొనియాడిన ఎమ్మెల్యే రాపాక
MLA Rapaka: జగన్ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని కోరిన ఎమ్మెల్యే
MLA Rapaka: సీఎం జగన్‌ను కొనియాడిన ఎమ్మెల్యే రాపాక
MLA Rapaka: సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చి దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపిన సీఎం జగన్ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని ఎమ్మెల్యే రాపాక కోరారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో జగనన్న సురక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఏపీలోని వాలంటీర్ వ్యవస్థను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరగడం శుభసూచకమని చెప్పారు.