ఈనెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLA Quota MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన వైసీపీ

Update: 2023-03-20 03:06 GMT

ఈనెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

MLA Quota MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల ఎఫెక్ట్‌తో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఏపీ వైసీపీ ఎమ్మెల్యేల కదలికలపై ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టింది. అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా..? అని జిల్లాల్లో ఆరా తీస్తోంది. ఈనెల 23న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యే కోటాలో ఏడు ఖాళీలు ఉండగా.. 8 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనూహ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిలక బరిలో టీడీపీ అభ్యర్థిని నిలిపింది.

దీంతో వైసీపీ నుంచి ఒక్క ఓటు చేజారినా ఫలితాలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అయితే ఆత్మ ప్రభోదానుసారం ఓటేస్తామంటున్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామ్ నారాయణరెడ్డి. ఆనం, కోటంరెడ్డి కాకుండా అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా అని ఇంటెలిజెన్స్ ఆరా తీస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులకు పార్టీలు విప్ జారీ చేశాయి.

Tags:    

Similar News