ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసన.. మురుగునీటి కాల్వలోకి దిగి ఆందోళన...
*సమస్య పరిష్కరించే వరకు కదలనంటూ.. మురుగు కాల్వలోనే కూర్చున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసన.. మురుగునీటి కాల్వలోకి దిగి ఆందోళన...
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఎమ్మెల్యే కోటంరెడ్డి మురుగు నీటిలోకి దిగి నిరసన తెలిపారు. ఆయనకు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఉమ్మారెడ్డి గుంటలో కొన్నేళ్లుగా మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో.. అధికారులు ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో మురుగునీటిలో దిగి నిరసన వ్యక్తం చేశాడు. మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించే వరకు కదలనంటూ మురుగు కాల్వలో కూర్చున్నారు.