Chellaboina Venu: పవన్ గ్లామరున్న నేతగా కాదు గ్రామర్ తో మాట్లాడాలి
Chellaboina Venu: జనసేనాని పవన్ కల్యాణ్ పై మంత్రి వేణు ఘాటు వ్యాఖ్యలు
Chellaboina Venu: పవన్ గ్లామరున్న నేతగా కాదు గ్రామర్ తో మాట్లాడాలి
Chellaboina Venu: పవన్ కల్యాన్ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి చెల్లబోయిన వేణు. పవన్ కల్యాణ్ గ్లామర్ ఉన్న వ్యక్తే అయినప్పటికీ.. కాస్త గ్రామర్ తో మాట్లాడితే బాగుంటుందని సెటైర్ వేశారు. విప్లవాలో అధికారంలోకి రాలేరన్నారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన భావ స్వేచ్చ హక్కును మిస్ యూజ్ చేయొద్దని చురకలంటించారు. ఏదో ఊగిపోతూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడటం రాజకీయం కాదన్నారు. రాజకీయ అవసరాలకోసం బీజేపీ, చంద్రబాబు అంటూ పొత్తు పాలిటిక్స్ చేస్తున్న మీరు వ్యవహారి శైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. రాజకీయం అంటే మీలా నటించడం కాదు.. ప్రజల్లో ప్రజలలాగ జీవించాలన్నారు. ఆవిషయంలో సీఎం జగన్ ప్రజల గుండెళ్లో ఉన్నారన్న మంత్రి జగన్ పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తీసేయలేరని స్పష్టం చేశారు మంత్రి వేణు.