అస్వస్థతకు గురైన మంత్రి పినిపే విశ్వరూప్.. ఆసుపత్రికి తరలింపు..
Pinipe Viswarup: ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన మంత్రి పినిపే విశ్వరూప్.. ఆసుపత్రికి తరలింపు..
Pinipe Viswarup: ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారు. నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఉత్సాహంగా కనిపించారు. ఛాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయారు. వెంటనే మంత్రి విశ్వరూప్‌ను అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.