ప్రకాశం బ్యారేజ్‌ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు

లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం లంక గ్రామాల ప్రజలను అలర్ట్ చేశాం ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు -నిమ్మల

Update: 2025-10-30 12:09 GMT

ప్రకాశం బ్యారేజ్‌ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు 

నిండుకుండలా మరిన ప్రకాశం బ్యారేజ్‌ని మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 6 నుంచి 6 లక్షల 50 వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగవకు విడుదల చేశారు. 

Tags:    

Similar News