Nara Lokesh: నేపాల్‌లో తెలుగువారి రక్షణపై లోకేశ్ దృష్టి
Nara Lokesh: నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు.
Nara Lokesh: నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై మంత్రి నారా లోకేష్ దృష్టి సారించారు. అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను ఏపీ భవన్ అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 215 మంది తెలుగు వారు నేపాల్‌లో చిక్కుకున్నట్టు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. తెలుగువారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అక్కడ వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు.
తెలుగు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై వివిధ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రతి 2 గంటలకు నేపాల్‌లో చిక్కుకున్న వారి క్షేమ సమాచారం తెలుసుకోవాలని సూచించారు. నేపాల్‌లో చిక్కుకున్న కొంతమంది తెలుగువారితో వీడియోకా ల్‌లో లోకేష్ మాట్లాడారు. సూర్య ప్రభ అక్కడ ఉన్న పరిస్థితిని వివరించారు. ముక్తి నాథ్ దర్శనానికి వెళ్ళి ఒక హోటల్ లో చిక్కుకున్నామని తెలిపారు. హోటల్ నుంచి బయటకు రావొద్దని, ప్రతి 2 గంటలకు ఒకసారి మీతో అధికారులు సంప్రదిస్తారని లోకేష్ వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.