Nara Lokesh: నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

Update: 2025-11-06 06:21 GMT

Nara Lokesh: నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్

Nara Lokesh: నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే కావలికి చేరుకున్నారు. జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కి జాతీయ రహదారి టోల్‌గేట్ వద్ద నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి మంత్రి ఫరూక్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి దగదర్తికి చేరుకున్నారు. ఇటీవల మరణించిన ఏపీ ఆగ్రోస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన అన్న కుమారుడు భానుచందర్ కుటుంబాలను లోకేశ్ పరామర్శించారు. వారికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News