ఈ నెల 8న కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొననున్న మంత్రి లోకేష్

కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలినేని, కలెక్టర్ అనంద్ కమార్ పరిశీలించారు.

Update: 2025-11-05 06:17 GMT

కనకదాస జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే అమిలినేని, కలెక్టర్ అనంద్ కమార్ పరిశీలించారు. జయంతి వేడుకల ప్రాంగణం, స్టేజ్ ఏర్పాటు, ప్రజలు వచ్చే దారులు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ వంటి అంశాలపై కూలంకషంగా సమీక్ష జరిపారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడింగ్ సిస్టమ్ పటిష్టంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశముందని, ఎటువంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ 7వ తేదీన కళ్యాణదుర్గం చేరుకుని, 8న కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News