కృష్ణా జిల్లా మంత్రులుగా పనిచేసిన వారు తిరిగి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవట్లేదో ఇపుడు తెల్సింది! మంత్రి కొడాలి నాని

Update: 2019-06-28 10:52 GMT

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హోదాలో గుడివాడలో పర్యటించిన నాని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'గత 35 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా పనిచేసినవారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేదు. అసలు మంత్రిగా అయితే ఎందుకు ఓడిపోతారు అని అనుకునేవాడిని.

కానీ గత 15-20 రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతుంటే నాకు తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు సొంత పనులు, నియోజకవర్గ పనులు ఉంటాయి. ఏదైనా పనిచేయడానికి నేను బయటకు అడుగుపెడితే, పక్క ఊరు , పక్క జిల్లా నుంచి వచ్చి నన్ను తమ పనుల విషయమై పలువురు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో  అసలు మన సొంత పనులు పోతున్నాయి. నియోజకవర్గ పనులు పోతున్నాయి' అని నాని తెలిపారు. ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత దేవినేని అవినాశ్ పై కొడాలి నాని ఘనవిజయం సాధించారు.


Tags:    

Similar News