అమరావతి అక్రమాలపై సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం : మంత్రి కొడాలి నాని

Update: 2020-09-19 10:25 GMT

అమరావతి లో జరిగిన అక్రమాల పై పార్లమెంట్, సుప్రీంకోర్టు లోను తేల్చుకుంటాం అని మంత్రి కొడాలి నాని అన్నారు.. అమరావతి లో జరిగిన అక్రమాలను విచారిస్తామని చెబితే ఇపుడు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని నాని ఆరోపించారు. అమరావతి ల్యాండ్ స్కామ్ పై మంత్రివర్గ ఉపసంఘం వేసి ప్రత్యేక దర్యాప్తు చేస్తుంటే దీనిని అడ్డుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగానికి లోబడే ప్రతీ వ్యవస్ధ పని చేయాలని కొందరు వ్యక్తులు వ్యవస్థలలో లొసుగులు అడ్డుపెట్టుకుని వాటిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఏదైనా చెయ్యగలం అన్న చందంగా కొన్ని వ్యవస్థలు పని వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సాధారణ పౌరులకు ఉన్న స్వేచ్ఛ స్వతంత్రలే అన్ని వ్యవస్థలకు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం అటువంటి వాటి గురించి ధైర్యంగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

వైసీపీ ఎంపీలు రాష్ట్రంలోని న్యాయవ్యవస్థ గురించి మాట్లాడితే.. టిడిపి అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. మగాడైన ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో పని చేయడంపై తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 10 రూపాయలు పెంచితే ఒక్కరు కూడా మాట్లాడలేదు.. ఇప్పుడు రహదారులు మరమ్మతులు చేయడానికి రాష్ట్రంలో రూపాయి సెస్ వేస్తే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Tags:    

Similar News