జస్టిస్ రాకేష్ కుమార్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని

* జగన్‌పై జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం * మనస్తత్వాన్ని బట్టి గూగుల్ సమాచారం అందిస్తుంది: కొడాలి నాని * పక్క రాష్ట్రం నుంచి వచ్చే వారి గురించి పట్టించుకోం: కొడాలి నాని

Update: 2021-01-01 11:18 GMT

పదవీ విరమణ చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. జస్టిస్ రాకేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. గూగుల్‌లో జగన్ గురించి సెర్చ్‌ చేస్తే ఆయనపై కేసులు నమోదైనట్లు సమాచారం వచ్చిందంటూ జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పడాన్ని నాని తప్పు పట్టారు.

తాను గూగుల్‌లో జగన్‌ గురించి సెర్చ్ చేస్తే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయ్యని సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా వచ్చిందని కొడాని నాని తెలిపారు. ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుందో అలాంటి సమాచారాన్నే గూగుల్ అందిస్తుందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌తోపాటు పక్క రాష్ట్రం నుంచి వచ్చే కొంత మంది పనికిమాలిన వాళ్ల సర్టిఫికేట్లు తమకు అవసరం లేదన్నారు. 

Full View


Tags:    

Similar News