Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన
Gudivada Amarnath: రాజధాని కోసం సెంటు ప్రయివేటు భూమి కూడా తీసుకోం
Gudivada Amarnath: వచ్చే విద్యా సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన
Gudivada Amarnath: వచ్చే అకడమిక్ సంవత్సరం నుంచే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తామని, విశాఖలో పెట్టబోయే రాజధాని కోసం ఒక్క సెంటు ప్రైవేటు భూమి కూడా తీసుకోమని ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ మొదటి స్థానంలో ఉందని, కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఏపీ నిలిచిందన్నారు మంత్రి విశాఖపట్నంలో జరిగే లావాదేవీల్లో తప్పేముందని, రానున్న కాలంలో పరిశ్రమలపై పెట్టబోయే పెట్టుబడులపై చర్చించామని, 2019 డిసెంబర్ 17న మూడు రాజధానులపై సీఎం తమ వైఖరి చెప్పారని పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత ట్రాన్సాక్షన్స్ నిరూపించాలని, ఆధారాలుంటే తీసుకురావాలని ఆయన ప్రతిపక్షాన్ని కోరారు. ఏమీ లేని అమరావతిలో రోడ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదన్నారాయన యాత్ర పేరుతో విధ్వంసం సృష్టించాలని చూస్తే చంద్రబాబే బాధ్యుడవుతాడని మంత్రి హెచ్చరించారు.