Gudivada Amarnath: టిక్కెటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోతేనే మంచిది

Gudivada Amarnath: ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు

Update: 2023-12-28 10:56 GMT

Gudivada Amarnath: టిక్కెటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోతేనే మంచిది

Gudivada Amarnath: తమ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన బలమైన నాయకత్వం వైసీపీదన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. విశాఖలో ఆ‍యన మీడియాతో మాట్లాడారు. రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని, ఈ చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారాయన. ఎమ్మెల్సీ వంశీ జనసేనలో చేరి రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని, టిక్కెటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు తమ పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిదని గుడివాడ అమర్‌నాథ్ అభిప్రాయ పడ్డారు.

ప్రత్యక్ష రాజకీయాల కోసమే పార్టీ మరాను తప్ప. జనసేన, పవన్ కళ్యాణ్ నచ్చి వెళ్లినట్టు వంశీ చెప్పలేదనన్నారాయన... ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలో అయినా చేరవచ్చని చెప్పారు. ఎన్నికల హామీకి కట్టుబడి పెంచిన మూడు వేల రూపాయల పెన్షన్‌ను పండుగ వాతావరణంలో పంపిణీ చేస్తామని అమర్ నాథ్ వెల్లడించారు.

Tags:    

Similar News