Dharmana Prasada Rao: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే మా రాష్ట్రం మాకిచ్చేయండి..
Dharmana Prasada Rao: రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dharmana Prasada Rao: అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే మా రాష్ట్రం మాకిచ్చేయండి..
Dharmana Prasada Rao: రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలని టీడీపీ అనుకుంటే... ఉత్తరాంధ్రలో ఉన్న తాము చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామన్నారు. మా చిన్న రాష్ట్రంగా ఏదోలా పరిపాలించుకుంటామని మంత్రి ధర్మాన చెప్పారు. జన్మభూమి పేరుతో టీడీపీ నాయకులు ప్రజల్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇదేమి ఖర్మరా, బాదుడే బాదుడు అని చంద్రబాబు తిరగడం...మన ఖర్మ అని విమర్శించారు. ఇంకా సైకిల్‌ని నమ్మి ప్రజలు మోసపోవద్దని ధర్మాన అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు... ముసలివాడు అయినందున సరిగా అడుగులు కూడా చంద్రబాబు వేయలేకపోతున్నారని ధర్మాన విమర్శలు చేశారు.