ధర్మపురి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మంత్రి దామోదర్ పూజలు
Minister Damodar: మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
ధర్మపురి లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో మంత్రి దామోదర్ పూజలు
Minister Damodar: జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన దామోదర్ రాజనర్సింహను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.