Botsa Satyanarayana: ఏపీలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Botsa Satyanarayana: అందులో భాగంగానే 95శాతం మేనిఫెస్టో హామీలు అమలు చేశాం
Botsa Satyanarayana: ఏపీలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
Botsa Satyanarayana: ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ కల్యాణ మస్తు, షాదీ తోఫా వంటి బృహత్తర పథకాలు తీసుకొస్తే ఆక్రెడిట్ ప్రభుత్వానికి రాకూడదనే దురుద్దేశంలో ప్రతిపక్షాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్న ఆయన.. గత ప్రభుత్వాల హాయంలో ఏం జరిగిందో ఎవరు ఏం చేశారో తమకూ తెలుసని చురకలంటించారు.
చంద్రబాబు ఆయన బ్యాచ్ కు కడుపుమంట తప్పితే మరోటి లేదన్నారు. అందుకే ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ దుష్ప్రచారమేపనిగా ప్రజల్ని గందరగోలానికి గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం ఏ పథకం ప్రారంభించినా టీడీపీ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కల్యాణ మస్తు పథకం తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.