ఎస్‌ఈసీ నిమ్మగడ్డపై మంత్రి అవంతి మండిపాటు
* రాష్ట్రాభివృద్ధిని చూడలేకే చంద్రబాబు, నిమ్మగడ్డ నాటకాలు -అవంతి * హైకోర్టు తీర్పు నిమ్మగడ్డకు చెంపపెట్టు - అవంతి * నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు - అవంతి
Avanthi Srinivas and Nimmagadda Ramesh (file image)
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని చూడలేకే చంద్రబాబు నిమ్మగడ్డతో కలిసి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, హైకోర్టు తీర్పు నిమ్మగడ్డకు చెంపపెట్టు అని అన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ నిమ్మగడ్డ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని కోరామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అవంతి.