Ambati Rambabu: భద్రాచలం మాదంటే ఇచ్చేస్తారా...?
Ambati Rambabu: పోలవరం విలీన గ్రామాలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై ఉద్ధేశపూర్వకంగా వివాదంలోకి తీసుకురావడం మంచిది కాదని..
Ambati Rambabu: భద్రాచలం మాదంటే ఇచ్చేస్తారా...?
Ambati Rambabu: పోలవరం విలీన గ్రామాలు, పోలవరం ప్రాజెక్టు అంశాలపై ఉద్ధేశపూర్వకంగా వివాదంలోకి తీసుకురావడం మంచిది కాదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సూచించారు. సీడబ్ల్యూసీ అనుమతితోనే ప్రాజెక్టు ఎత్తును పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే కేంద్రంతో మాట్లాడుకోవాలేగానీ, రాద్ధాంతం చేయడం మంచిదికాదన్నారు. భద్రాచలం మాదంటే.. ఇచ్చేస్తారా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు.