టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్, పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు.

Update: 2020-02-26 15:53 GMT
Adimulapu suresh File Photo

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మిడియట్, పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. ఇంటర్ పరీక్షలపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కూడా వినియోగించుకుంటామని తెలిపారు. ఇవాళ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స ద్వారా డీఈవోలు, ఆర్ఐలతో చర్చించారు. ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తామని వెల్లడించారు. కడప జిల్లాలో ఆర్‌ఐను ఇంటర్ రీక్షల ఇన్విజిలేటింగ్ కోసం సచివాలయ ఉద్యోగుల జాబితాను కోరారు.

ఇంటర్ పరీక్షలు మార్చి 4 నుంచి 23 వరకు ఉంటాయని, 1,411 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏటువంటి ఘనటలు జరగకుండా 144 సెక్షన్ అమలు అవుతుందని అన్నారు. పరీక్షల సమయంలో ఆ ప్రాంతంలో జిరాక్స్ కేంద్రాలు కూడా మూసివేసేలా చర్యలు తీసుకుటున్నట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లును ఏదైనా అత్యవసర పరిస్థితి మాత్రమే సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుంటామని తెలిపారు. అంతేకాదు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో కేటాయిస్తామన్నారు.

విద్యార్థుల హాల్ టికెట్లపై క్యూఆర్‌కోడ్ ఉంటుందని, పరీక్షా కేంద్రాలు తెలుసుకునేందుకు ఓ మొబైల్ యాప్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు జాబితాను వెల్లడిస్తామని ప్రకటించారు. మార్కుల జాబితా లేని పక్షంలో ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి వెల్లడించారు. సీసీ కెమెరాలు కాపీయింగ్ జరగనుకుండా ఉపయోగిస్తామని, పేపర్ల లీకేజీ లేకుండా ఉండేందుకు ఛీఫ్ సూపర్ వైజర్ మినహీ ఇతరుల వద్ద మొబైల్ ఫోన్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 

Tags:    

Similar News