Manickam Tagore: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం
Manickam Tagore: షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలన్నది అధిష్టానం చూసుకుంటుంది
Manickam Tagore: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషం
Manickam Tagore: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్. షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలన్నది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాబోతోందని ఆయన స్పష్టం చేశారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ మనిషి అని, వైఎస్సార్ పేరును వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామన్నారు మాణిక్కం ఠాగూర్. ఏపీ పీసీసీ చీఫ్ మార్పు.. కాంగ్రెస్ అధ్యక్షుడి చేతిలో ఉంటుందన్నారు.