సీఎం జగన్ కు సోదరి తోపాటు సినీ రాజకీయ ప్రముఖుల విషెష్..

Update: 2019-12-21 10:47 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు హీరో మహేష్ బాబు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో 'మా గౌరవనీయ సీఎం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం మరియు విజయం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అలాగే జగన్ సోదరి, మంచు వారి కోడలు విరానికి కూడా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News