Paritala Sunitha: పరిటాల సునీత కాళ్లపై పడిన వ్యక్తి
* వైసీపీలో చేరి తప్పుచేశానంటూ ఆవేదన.. రామాంజనేయులును పార్టీలోకి ఆహ్వానించిన సునీత..!
Paritala Sunitha: పరిటాల సునీత గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముచ్చుమర్రి రామాంజనేయులు అనే వ్యక్తి హఠాత్తుగా వచ్చి సునీత కాళ్లపై పడ్డారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి చేరి తప్పు చేశానంటూ కాళ్లు పట్టుకొని కన్నీటి పర్యంతమైయ్యాడు. దీంతో అతన్ని పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు సునిత. టీడీపీలో ఎప్పటికీ స్థానం ఉంటుందని చెప్పి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.