యువకుడ్ని చితకబాదిన పోలీసులు: చికిత్స పొందుతూ మృతి

Update: 2020-04-20 06:42 GMT

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం జరిగింది. పోలీసుల దెబ్బలు తాళలేక ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.షేక్‌ మహ్మద్‌ గౌస్‌(33) అనే యువకుడు మందుల కోసం మెడికల్ షాపుకు వచ్చాడు. అతనిని పోలీసులు సత్తెనపల్లి చెక్ పోస్ట్ వద్ద ఆపివేశారు. ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా.. మందుల కోసం వెళ్తున్నానని సమాధానం ఇచ్చాడు. అయితే లాక్ డౌన్ ఉంది.. తెలియదా అని ప్రశ్నించారు. ఎందుకు తిరుగతున్నావని దాడికి తెగబడ్డారు. అతను అక్కడే కుప్పకూలి కింద పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌస్ మరణించడంతో, అతని మృతికి పోలీసులే కారణమంటూ, బంధువులు ఆందోళనకు దిగారు.

ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ, ఆ ప్రాంతంలో రెడ్ జోన్ అమలులో ఉన్నందున కంటైన్ మెంట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నామని స్పష్టం చేశారు. గౌస్ ను పోలీసులు ఆపిన సమయంలో ఎటువంటి ప్రిస్క్రిప్షన్ ను చూపించలేదని తెలిపారు. అతనికి వేరే ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, జరిగిన ఘటనపై శాఖా పరమైన విచారణకు ఆదేశించామని, పోలీసుల తప్పుందని భావిస్తే, చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Tags:    

Similar News