Watch: పెళ్లాం కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన మొగుడు
Watch: ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
Watch: పెళ్లాం కాపురానికి రాలేదని సెల్ టవర్ ఎక్కిన మొగుడు
Watch: భార్య కాపురానికి రావడం లేదని భర్త సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. మదనపల్లి మండలం పాలెంకొండకు చెందిన ఎర్రి కృష్ణ మూర్తికి సీపీఎం క్రాస్ రోడ్ లోని ధనమ్మ, హరికృష్ణల కుమార్తె చంద్రకళతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే గత కొంత కాలంగా ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య చంద్రకళ తన పుట్టింటికి చేరింది. కాగా భార్యను తీసుకెళ్లేందుకు భర్త కృష్ణ మూర్తి రాగా భార్య నిరాకరించింది.
కాపురానికి రమ్మంటే భార్య రాకపోవడంతో మనస్థాపానికి గురైన కృష్ణ మూర్తి స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని హచల్ చల్ చేయడంతో స్థానికులు సెల్ టవర్ వద్ద పెద్ద ఎత్తున గుమ్మికూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరి కృష్ణ మూర్తిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.