పండగెల్లిపోయింది..పట్నం బాట పట్టిన ప్రజ!

* సంక్రాంతి సందడి ముగియడంతో నగరబాట పట్టిన జనం * ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు * ఈ నెల 19 వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడపనున్న ఆర్టీసీ

Update: 2021-01-17 03:52 GMT

ప్రాతీకాత్మక చిత్రం 

స్వగ్రామాల్లో బంధువుల మధ్య సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ 'నగర'బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు 2,057 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది.

ఏపీలోని అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అత్యధికంగా 954 ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది ఆర్టీసీ. ఆ తర్వాత బెంగళూరుకు 409, చెన్నైకి 131 ప్రత్యేక సర్వీసులు కేటాయించింది. ఆదివారం ఒక్క రోజే ఏకంగా 359 సర్వీసులు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తిప్పనున్నారు. ఇక బెంగళూరుకు 142, చెన్నైకి 51 సర్వీసులు నడుపుతున్నారు.

పండగ హడావిడి ముగియడం వల్ల నేడు అత్యధికులు హైదరాబాద్ కు వచ్చేందుకు నిర్ణయించుకోవడంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం నర్సాపూర్, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల నుంచి స్పెషల్ రైళ్లు హైదరాబాద్ కు నడిపించనుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ లో సైతం ప్రయాణాలకు డిమాండ్ అధికంగా ఉంది.

Tags:    

Similar News