Maoists: ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్.. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Maoists: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నిన్న పోలీసు ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందాగా.. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది.
Maoists: ఏవోబీలో మరో ఎన్‌కౌంటర్.. కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
Maoists: మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నిన్న పోలీసు ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందాగా.. తాజాగా అల్లూరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. నిన్న మారేడుమిల్లి అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. జీఎం వలస సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ ను ఇంటెలీజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. మారేడు మిల్లి ఏజెన్సీలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మృతుల్లో మావోయిస్టు కీలకనేతలు దేవ్ జీ, ఆజాద్ ఉన్నట్టు సమాచారం.
మారేడుమిల్లి ఎన్ కౌంటర్ ఘటనలో కీలక నేతలు హతమయ్యారు. వారిలో సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు, ఆంద్రా ఒరిస్సా బోర్జర్ ఇంచార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నంబాల కేశవరావు ప్రొటక్షన్ టీం కమండర్, డివిజనల్ కమిటీ సభ్యురాలు జ్యోతి తో పాటు మావోయిస్టు పార్టీ కమ్యూనికేషన్ టీం చీఫ్, సౌత్ జౌనల్ కమిటీ మెంబర్ సురేష్ అలియాస్ రమేష్, ఏరియా కమిటీ సభ్యులు జాగరగొండి ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్ హతమయ్యారు. వీరితో పాటు జాగరగొండ డిప్యూటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యుడు శ్రీను అలియాస్ వాసు, జాగరగొండ డివిజనల్ కమిటీ , ఏరియా కమిటీ సభ్యురాలు అనిత, కమిటీ సభ్యురాలు షమ్మీ ఎన్ కౌంటర్ లో హతమయ్యారు.
ఆపరేషన్ కగార్ ఒత్తిడితోనే మావోయిస్టులు అడవిని వీడుతున్నారని ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్రలడ్డా తెలిపారు. మావోయిస్టుల కదలికలపై రెండు నెలలుగా మానిటరింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్ లో తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతుందన్నారు. మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాదీనం చేసుకున్నామని చెప్పారు. అలూరి జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా చనిపోయారని.. రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్ట చేశామని వెల్లడించారు. కాకినాడలో మరో ఇద్దరిని, కోనసీమలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇతర మావోయిస్టులు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోతే ప్రభుత్వం నుంచి రివార్డు అందచేస్తామని తెలిపారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న 50 మంది మావోయిస్టులను కమాండ్ కంట్రోల్ రూమ్ కు తరలించారు. భారీ భద్రత మధ్య మావోయిస్టులను ఏలూరు, కాకినాడ, కృష్ణ, ఎన్జీఆర్ జిల్లాల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ కు పోలీసులు తరలించారు. పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న రైఫిల్స్, పిస్టల్స్, డిటోనెటర్లు, మ్యాగ్జిన్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, పెన్ డ్రైవ్ లు , విప్లవ సాహిత్యం , హిడ్మా ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.