మహేష్‌బాబుకు జగనన్నవిద్యాదీవెన..!

కర్నూలు జిల్లా అధికారులు ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబుకు జగనన్న విద్యాదీవెన పథకంలో అర్హత కల్పించారు.

Update: 2020-02-26 05:05 GMT
మహేష్‌బాబుకు జగనన్నవిద్యాదీవెన..!

కర్నూలు జిల్లా అధికారులు ప్రముఖ సినీహీరో మహేశ్‌బాబుకు జగనన్న విద్యాదీవెన పథకంలో అర్హత కల్పించారు. ఇది నిజం కాకపోయినా మహేశ్‌బాబు ఫొటోతో ఉన్న జగనన్న దీవెన కార్డు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పత్తికొండ నియోజకవర్గంలోని వైష్ణవి డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ చదువుతున్న పరంపోగు లక్ష్మి జగనన్న విద్యాదీవెన పథకం కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే విద్యార్థిని ఫోటోపై అధికారులు పొరపాటున సినీ నటుడు మహేష్‌బాబు ఫోటోను ముద్రించారు. జరిగిన పొరపాటును అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే తప్పు జరిగిందంటున్నారు.




Full View


 


Tags:    

Similar News