Kotappakonda: పల్నాడుజిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు
Kotappakonda: వేకువజామున లింగోద్భవ కాల అభిషేకం
Kotappakonda: పల్నాడుజిల్లా కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు
Kotappakonda: పల్నాడు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్థరాత్రి పవిత్రతీర్థంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అభిషేకాలు అనంతరం త్రికోటేశ్వరుని దర్శించుకోడానికి భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారికి సుగంధపరిమళ ద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా నిలిచిన దివ్యక్షేత్రంగా కోటప్పకొండ భాసిల్లుతోంది. త్రికూటక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలను రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. త్రికోటేశ్వరునికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. దేవస్థాన ధర్మకర్త అయిన రాజరామకృష్ణ కొండలరావు వంశస్తులుచే రాత్రి లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. స్వామివారికి శివరాత్రి పర్వదినాన నిర్వహించే తొలి పూజ కార్యక్రమాలను దర్శించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామునుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు.