Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam: ధ్వజపటం ఆవిష్కరించిన ఈవో లవన్న
Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో లవన్న దంపతులు, ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యులు, అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో బేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. ముందుగా చండీశ్వరుడిని పల్లకిలో ఊరేగిస్తూ ఆలయ ప్రదక్షిణ చేసి ద్వజస్తంభం వద్దకు వైభవంగా తీసుకువచ్చారు. వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు.