Digital Mahanadu 2021: డిజిటల్ వేదికగా మ‌హానాడు

Digital Mahanadu 2021: మ‌హానాడు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధిష్టానం నిర్ణ‌యించింది.

Update: 2021-05-26 14:28 GMT

చంద్రబాబు ఫైల్ ఫోటో 

Digital Mahanadu 2021: మ‌హానాడు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధిష్టానం నిర్ణ‌యించింది. ఈ సారి వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలోనే నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు భావించారు. రేపు, ఎల్లుండి జ‌రిగే మ‌హానాడులో పాల్గొనాల‌ని పార్టీ నాయ‌కుల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

'మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో జరిగే '#DigitalMahanadu2021'లో కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యం, రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు, స్కాములు.. తదితర అంశాలపై తీర్మానం చేయనున్నాం. అందరూ కలిసి రండి. 'డిజిటల్ మహానాడు 2021'ను విజయవంతం చేయండి' అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

'స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించాం' అని చంద్ర‌బాబు నాయుడు చెప్పారు.

Tags:    

Similar News