మహా శివరాత్రి వేళ విషాదం... గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Update: 2025-02-26 08:00 GMT

మహా శివరాత్రి పండగ వేళ విషాదం... పుణ్యస్నానాల కోసం వెళ్లి గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు

Tragedy on Maha Shivaratri: మహా శివరాత్రి వేళ తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. స్నానం చేసేందుకు గోదావరిలోకి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు మొదలుపెట్టారు. గత ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం వెతకగా నలుగురి మృతదేహాలు లభించాయి. మరొకరు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గల్లంతయిన యువకులను పవన్, ఆకాష్, దుర్గా ప్రసాద్, పడాల సాయి, తిరుమలశెట్టి పవన్ గా గుర్తించారు.

ఇసుక మేటల్లో చిక్కుకుని

మహా శివరాత్రి వేళ పవిత్ర స్నానం చేద్దామని 11 మంది యువకులు తాడిపూడిలో గోదావరిలో దిగారు. అయితే, ఇసుక మేటల్లో ముగ్గురు చిక్కుకోగా వారిని రక్షించే ప్రయత్నంలోనే మరో ఇద్దరు యువకులు కూడా అందులోకి జారుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అవడంతో మిగతా ఆరుగురు యువకులు నీళ్లలోంచి బయటికి వచ్చి స్థానికులకు సమాచారం అందించారు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని గత ఈతగాళ్లను పిలిపించారు. కానీ అప్పటికే నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. యువకులు అంతా కూడా ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న వారే. పండగ వేళ చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

Full View

Tags:    

Similar News