Weather Update: అల్పపీడన ప్రభావం.. వర్షాల సూచనలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి ఇది వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.