డీఎన్ఎస్ మందుల కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించండి: లోకనాథం

మండలం నల్లమట్టిపాలెం, బుచ్చిరాజుపేట గ్రామాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న డి.ఎన్.ఎస్ బల్క్ డ్రగ్స్ కంపెనీని వ్యతిరేకించాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి కే.లోకనాధం పిలుపునిచ్చారు.

Update: 2019-12-13 05:49 GMT
సి.పి.ఎం జిల్లా కార్యదర్శి కే.లోకనాధం మరియు ఇతర సి.పి.ఎం నాయకులు

నక్కపల్లి: మండలం నల్లమట్టిపాలెం, బుచ్చిరాజుపేట గ్రామాల సమీపంలో ఏర్పాటు చేస్తున్న డి.ఎన్.ఎస్ బల్క్ డ్రగ్స్ కంపెనీని వ్యతిరేకించాలని సి.పి.ఎం జిల్లా కార్యదర్శి కే.లోకనాధం పిలుపునిచ్చారు. ఆయా గ్రామస్థులు మరియు సీపీఎం నాయకులతో కలిసి కంపెనీని నిర్మించనున్న ప్రాంతాన్ని లోకనాధం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇక్కడ మందుల పరిశ్రమను ఏర్పాటు చేయడం వలన భూగర్భ జలాలు, వాయుకాలుష్యం ఏర్పడి పరిసర గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతారని అన్నారు.

ఇప్పటికే జిల్లాలో పరవాడ దగ్గర మందుల పరిశ్రమలు స్థాపించడానికి భూములు కేటాయించారని, మరలా ఇక్కడ మందులు కంపెనీలు నెలకొల్పడానికి ప్రభుత్వం పూనుకోవడం సమంజసం కాదన్నారు. విశాఖ జిల్లా పరిశ్రమల కాలుష్యంతో రెడ్ జోన్ లో ఉందని, కాలుష్యం వెదజల్లే మరే ఇతర కంపెనీలను నిర్మించరాదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నప్పటికీ , అందుకు విరుధ్ధంగా పరిశ్రమలను నెలకొల్పుతున్నారని మండిపడ్డారు.


Tags:    

Similar News