Loksabha Elections 2024: నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు

Loksabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెలువరించింది.

Update: 2024-03-16 11:30 GMT

Loksabha Elections 2024: నాలుగో దశలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు

Loksabha Elections 2024: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు వెలువరించింది. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఏప్రిల్ 25 వరకూ అవకాశం కల్పించారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకూ గడువు ఇచ్చారు. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇటు తెలంగాణలోని లోక్ సభ స్థానాలకు మే 13నే ఎన్నికలు జరగనున్నాయి. మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటు కంటోన్మెంట్‌కు ఉప ఎన్నికను కూడా మే 13నే నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. లాస్య నందిత మృతితో తెలంగాణలోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది.

దేశవ్యాప్తంగా లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్‌ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ మే 20న, ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ మే 25న, ఏడో దశ ఎన్నికల పోలింగ్‌ జూన్‌ 1న జరుగనున్నాయి. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.

Tags:    

Similar News