Poorna Market : విశాఖలో వ్యాపారుల కొత్త పంథా

Update: 2020-07-13 12:00 GMT

Poorna Market : విశాఖలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. రోజూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమను తాము రక్షించుకునేందుకు పూర్ణామార్కెట్ వ్యాపారులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. స్వీయ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పూర్ణా మార్కెట్ విశాఖ నగర వాసులకు గుండెకాయ వంటిది. వందకు పైగా హోల్ సేల్ దుకాణాలు ఇక్కడ ఉన్నాయి. రద్దీ విపరీతంగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో మూడు నెలల పాటు ఇళ్లకు పరిమితమైన వ్యాపారులు అతికష్టం మీద దుకాణాలు తెరుచుకుని వ్యాపారాలు చేయడం ప్రారంభించారు. కానీ నగరంలో కరోనా విజృంభిస్తున్ననేపథ్యంలో వ్యాపారాల కంటే తమ ప్రాణాలే ముఖ్యమనుకున్నారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే షాపులు తెరవాలని నిర్ణయించుకున్నారు.

పూర్ణామార్కెట్ నుంచి విశాఖ జిల్లాకే కాకుండా పక్క జిల్లాలకు కూడా నిత్యావసర సరుకులు ఎగుమతి అవుతుంటాయి. ఉదయం 6 నుంచి 9 వరకు ట్రాన్స్ ఫోర్ట్ కు పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత టైం లో వ్యాపారాలు చేసుకుంటామని చెబుతున్నారు వ్యాపారులు. అవసరమైతే హోం డెలివరీ సర్వీసులను ఏర్పాటు చేసుకుంటామని అంటున్నారు. వినియోగదారుల రద్దీని నియంత్రించేందుకు స్వచ్చందంగా మార్కెట్లకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఎవ్వరికి వారు స్వీయ నిబంధన చాలా అవసరమని, అందుకే లాక్ డౌన్ పాటిస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు. మార్కెట్ కు వచ్చే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. స్వీయ రక్షణతోనే కరోనా ను కంట్రోల్ చేయొచ్చాంటున్నారు.

Tags:    

Similar News