Narsipatnam: పాలిటెక్నికల్ కళాశాలలో కూరగాయల మార్కెట్

కరోనా వైరస్ ని మరింతగా అడ్డుకునేందుకు లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పెంచాలని పలు రాష్టాల ముఖ్యమంత్రులు మోడీని కోరిన సంగతి తెలిసిందే.

Update: 2020-04-12 05:32 GMT
Polytechnic College Narsipatnam

నర్సీపట్నం: కరోనా వైరస్ ని మరింతగా అడ్డుకునేందుకు లాక్ డౌన్ ని మరో రెండు వారాలు పెంచాలని పలు రాష్టాల ముఖ్యమంత్రులు మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. శివపురం కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను స్థానిక పాలిటెక్నికల్ కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, పట్టణ సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఈరోజు పాలిటెక్నికల్ కాలేజీ ప్రాంతంలో ఉన్న స్థలాన్ని పరిశీలించి రేపటి నుంచి కాయగూరలు, మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ కృష్ణవేణి తెలిపారు.


Tags:    

Similar News