Marripadu: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాతో గందరగోళ పరిస్థితులు

రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయి వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా చేయుడంతో మర్రిపాడు మండలంలోని గ్రామాలలో రాజకీయ పార్టీలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2020-03-18 06:40 GMT
Andhra Pradesh Local Body elections

మర్రిపాడు: రాష్ట్రంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయి వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా చేయుడంతో మర్రిపాడు మండలంలోని గ్రామాలలో రాజకీయ పార్టీలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతో జోష్ లో ఉన్న వైసిపి పార్టీ ఎన్నికలు వాయిదా పడడంతో నిరుత్సాహానికి గురి అయింది. ఎన్నికలు వాయిదా పడకుండా ఉండి ఉంటే వాతావరణం ఏడెక్కీ రంజుగా ఉండేది.

ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేసిన ప్యాన్ స్పీడ్ చూత్రం తగ్గలేదు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ప్రధాన పార్టీల్లో వ్యతిరేకత నెలకొంది. ఎన్నికలు ఆరు వారాలపాటు వాయిదా వేయడంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఊపిరిపీల్చుకుంది. అలాగే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి. పార్టీకి వనరులు ఎలా సమవార్పుకోవాలి అని పోటీలో నిలిచిన అభ్యర్థులు, ఎలా సర్దుబాటు చేయాలని ఆందోళన చెందుతున్నారు.

ఇక టీడీపీలో నాయకులు కొంత మెరుగైన స్థితిలో ఉన్న బిజెపి-జనసేన కూటమి, ఉభయ కమ్యూజనులలో కూడా ఎన్నికలు వాయిదా హర్షిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు అర్ధాంతరంగా వాయిదా పడటంతో రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కు వార్ నడుస్తుంది. ఎన్నికలు వాయిదా వేసే విలక్షణ అధికారం నిజంగా ఎలక్షన్ కమిషన్ కు ఉందా! ఈ విషయంలో ప్రజల చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని విశ్వాసంలోనికి తీసుకోవాలన్న ఆవసరం లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాయిదా అనేక రాజ్యాంగపరమైన ప్రశ్నలకు తావిస్తుంది. ఎన్నికలు వాయిదా దేశ సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్ర సర్వోన్నత న్యాయ స్థానాలలో పిటిషన్లు వేయబడ్డాయి. రాజ్యాంగ పరమైన నూతన ప్రశ్నలకు కోర్టులే సమాధానం చెబుతాయి. అంత వరకు వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News