Andhra Pradesh: కాకినాడలో లలిత జ్యువెలరీ ప్రారంభం

Update: 2020-01-29 09:45 GMT

కాకినాడ: దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ 25 షోరూంను రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు, లలిత జ్యువెలరీ చైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కిరణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కాకినాడ ప్రజల కోసం ఆధునిక వసతులతో లలిత జ్యువెలరీని ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ భారత దేశ వ్యాప్తంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు.

లలిత జ్యువెలరీ ప్రారంభం సందర్భంగా ఎన్నడూ లేనివిధంగా బంగారు నగలపై మార్కెట్ ధర కన్నా రెండు శాతం తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు. ప్రజల కోసం షోరూంలో ఉన్న నగదు ఫోటోలను తీసుకుని బయట మార్కెట్లో ధరలు కొనుక్కోవచ్చు అని తెలిపారు. నాణ్యమైన నగలు ధరించడం పారదర్శకమైన విధానాన్ని లలిత జ్యువెలరీ అనుసరించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత హేమ కిరణ్ భక్తి భవ్యసుంకర పావని తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News