Ex-CM Chandra Babu Naidu: చంద్రబాబు ఇంటి దగ్గర మరోసారి హైడ్రామా

Update: 2021-05-09 01:58 GMT

Ex-CM Chandra Babu Naidu:(File Image) 

Ex-CM Chandra Babu Naidu: మరోసారి హైదరాబాద్ చంద్రబాబునాయుడు ఇంటి దగ్గర హైడ్రామా చోటు చేసుకోనున్నది. కర్నూలు పోలీసులు ఆదివారం చంద్రబాబు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వనున్నారు. వారంరోజుల్లో కర్నూలు పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో చెప్పనున్నారు. కొన్నాళ్ల క్రితమే ఏపీ సీఐడీ పోలీసులు కూడా ఇలాగే చంద్రబాబు ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారు. అప్పుడు అమరావతి అసైన్ మెంట్ ల్యాండ్స్ వ్యవహారం మీద నోటీసులిచ్చారు.. ఆ తర్వాత చంద్రబాబు హైకోర్టుకు వెళ్లడం స్టే తెచ్చుకోవడం జరిగాయి.

ఇప్పుడు కేసు కరోనా కేసు. అవును N440K వైరస్ కర్నూలులోనే వచ్చిందని.. ఇది చాలా ప్రమాదకరమైన వైరస్ అని చంద్రబాబు చెప్పారు. తర్వాత ఢిల్లీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ప్రజలను రానివ్వొద్దని.. వస్తే 14 రోజుల క్వారంటైన్ తప్పదని నిబంధన విధించింది. దీనిపై సైతం చంద్రబాబు స్పందించారు. దీంతో వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడింది. ముందు సలహాదారుడు సజ్జల విమర్శలు చేయగా.. ఆ తర్వాత మంత్రి కొడాలి నాని సైతం రంగంలోకి దిగారు.

కర్నూలులోని సుబ్బయ్య అనే వ్యక్తి పోలీసులకు చంద్రబాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో ఆ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప పోలీసులు ఆదివారం చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులిస్తారని.. అరెస్టు సంగతి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ చూసుకుంటారని కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఇంటి దగ్గర మరోసారి హైడ్రామా తప్పదనే అనిపిస్తోంది.

Tags:    

Similar News