Farmer Found Diamond in Kurnool: రైతు పంట పండింది.. పొలంలో వజ్రం ధర ఎంతంటే..?

Tuggali Farmer Diamond Found Rs 13 Lakhs: కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం మరోసారి వజ్రాల వార్తలతో హైలైట్ అయింది. దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు రోజుల క్రితం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విలువైన వజ్రాన్ని కనుగొన్నాడు.

Update: 2025-07-29 03:58 GMT

Farmer Found Diamond in Kurnool: రైతు పంట పండింది.. పొలంలో వజ్రం ధర ఎంతంటే..?

Tuggali Farmer Diamond Found Rs 13 Lakhs: కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం మరోసారి వజ్రాల వార్తలతో హైలైట్ అయింది. దిగువ చింతలకొండ గ్రామానికి చెందిన ఓ రైతు రెండు రోజుల క్రితం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా విలువైన వజ్రాన్ని కనుగొన్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఆ వజ్రాన్ని సోమవారం విక్రయించగా అదే మండలం చెన్నంపల్లికి చెందిన కొత్త వ్యాపారి రూ.13.5 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ప్రాంతంలో వజ్రాల లభ్యత కొత్తది కాదు. జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి, ఉప్పర్లపల్లి వంటి గ్రామాల రెవెన్యూ పొలాల్లో ఇటీవలి కాలంలో వజ్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే, ఈ ఏడాది కొత్తగా పెండేకల్లు, డీసీకొండ ప్రాంతాల్లో కూడా వజ్రాల కలిక తెలియడం విశేషం.

గతంలో కూడా రాంపల్లి గ్రామంలో ఇద్దరు రైతులు వజ్రం కనుగొనగా, దానిని విక్రయించిన తర్వాత లాభం పంచుకునే విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో పోలీసులు ఆ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు దానిని కూడా తమ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ వజ్రాలు ఎంత విలువైనవైనా సరే, వాటిని స్థానిక వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జొన్నగిరి, పెరవలి, గుత్తి, అనంతపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు కలసి వచ్చి రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు వజ్రాలు తీసుకుపోతున్నట్లు చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News