Corona: కృష్ణపట్నం ఆయుర్వేదం మందు కోసం పరుగెడుతోన్న జనం

Corona: ఈ మందు శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది.

Update: 2021-05-21 08:29 GMT

కృష్ణపట్నం ఆయుర్వేద మందు (ఫైల్ ఇమేజ్)

Corona: కరోనాతో మరణాలు సంభవిస్తుండటంతో.. ఇప్పటికే ప్రజలంతా కరోనా అంటే వణికిపోతున్నారు. అలాంటివారికి కృష్ణపట్నం పసరు మందు పని చేస్తుందనే కబురు అందటంతో వారంతా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు పరుగులు పెడుతున్నారు. కరోనాబారిన పడి బతుకుతామనే నమ్మకం లేనోళ్లంతా అటువైపు వెళుతున్నారు.

ఆనందయ్య అనే వ్యక్తి ఈ పసరు ముందును జిల్లేడు పువ్వులు, వేపాకు, ఉమ్మెత్త పువ్వులతో కలిపి చేస్తున్నారు. అయితే దీనికి ఇంకా అధికారికంగా ఆమోదముద్ర పడలేదు. ఆయుష్ కూడా ఇంకా ఏ విషయం చెప్పలేదు. అయితే స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి ఆనందయ్యకు మద్దతుగా నిలబడి.. మందు పంపిణీ చేయిపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం అధికారులతో చర్చించి అవసరమైతే అధికారికంగా ఆమోద ముద్ర వేయొచ్చనే అంశంపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

దివ్వఔషధంగా పేర్కొంటున్న ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కరోనా వైద్యం కోసం రూ.లక్షలకు లక్షలు ధారపోస్తున్న వేళ ఈ మందుపై ప్రజల్లో ఏదో తెలియని ఆశ చిగురించింది. దీంతో కొద్దిరోజులుగా కరోనా ఆయుర్వేద మందు కోసం వేల సంఖ్యలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం‌కు తరలివస్తున్నారు.

అయితే ఈ మందు శాస్త్రీయంగా రుజువు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల నిమిత్తం ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.కృష్ణపట్నంలో కరోనా మందు తయారీదారుడి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో ప్రజలు రాగా.. ఇప్పుడు నిత్యం 4-5వేల మంది వరకు వస్తున్నారు.

Tags:    

Similar News