తిరుమలలో నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం.. ఉ.11గంటల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి
TTD: 17న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా నేడు ఆలయ శుద్ధి
తిరుమలలో నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం.. ఉ.11గంటల తర్వాత భక్తుల దర్శనానికి అనుమతి
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో కొయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాని టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించింది. 17వ తేదీనా జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా నేడు ఆలయ శుద్ధి కార్యక్రమాని అర్చకులు, అధికారులు చేపట్టారు. తెల్లవారు జామున స్వామివారి సుప్రభాత సేవనాంతరం దర్శనాన్ని నిలిపివేయనున్నారు. మహాద్వారం మొదలుకొని ఆలయం మొత్తం నీటితో శుద్ధిచేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయ ప్రహరీలకు, గోడలకు లేపనం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసారు. అనంతరం మూలమూర్తికి చుట్టిన వస్త్రాని తొలగించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, నివేదనలు సమర్పిస్తారు.