Andhra Pradesh: అమ్మఒడికి వాలంటీర్లు అర్హులే: మంత్రి కొడాలి నాని

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన విద్యా విప్లవంలో భాగంగా శ్రీకారం చుట్టిన అమ్మఒడి పథకంలో గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా అర్హులేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Update: 2020-01-25 09:07 GMT

గుడివాడ: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన విద్యా విప్లవంలో భాగంగా శ్రీకారం చుట్టిన అమ్మఒడి పథకంలో గ్రామ, వార్డు వాలంటీర్లు కూడా అర్హులేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. శనివారం స్థానిక రాజేంద్రనగర్ లోని ఆయన గృహంలో పట్టణంలో పని చేస్తున్న పలువురు వార్డు వాలంటీర్లు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. మొదటి విడత అమ్మఒడి పథకం తమకు మంజూరు కాలేదని, ఐడి నెంబర్లు బ్లాక్ అయినట్టుగా ఆన్లైన్లో కనిపిస్తోందన్నారు.

దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు వచ్చి ఉండొచ్చని, వీటిని పరిష్కరిస్తానని చెప్పారు. అమ్మ ఒడి మంజూరు కాని వాలంటీర్లు ఆందోళన చెందవద్దని సూచించారు. వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని, వాలంటీర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా వెంకట రమణ (బాబ్జి) తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News