Vizag: కిడ్నీ ఇస్తే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామన్నారు.. ఇచ్చేసిన బాధితుడు.. ఆ తర్వాత
Vizag: రూ.8.5 లక్షలకు కిడ్నీని విక్రయించిన వినయ్‌కుమార్
Vizag: కిడ్నీ ఇస్తే ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామన్నారు.. ఇచ్చేసిన బాధితుడు.. ఆ తర్వాత
Vizag: విశాఖలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. పెందుర్తి పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాధితుడు వినయ్ కుమార్ నుంచి వైద్యులు కిడ్నీ తీసుకున్నారు. చివరికి సీన్ రివర్స్ అయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కిడ్నీకి 8. 50 లక్షలు ఇస్తామంటూ కామరాజు, శ్రీను..., వినయ్ కుమార్‌కు డబ్బు ఆశ చూపారు. డీల్ కుదుర్చుకున్న ప్రకారంగానే కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించాడు బాధితుడు వినయ్ కుమార్. కలెక్టర్ ఆఫీస్ సమీపంలో ఓ ల్యాబ్‌లో వినయ్‌కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్న తరువాత వినయ్‌కు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో తనకు అన్యాయం జరిగిందని, తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హాస్పిటల్ డాక్టర్, మధ్యవర్తులు కామరాజు, శ్రీనులు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే హాస్పిటల్‌కు లైసెన్స్ ఉందా, డాక్టర్లు నకిలీనా అని తేల్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు, అమాయకులకు డబ్బు ఆశ చూపి, కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పిస్తున్నారు. కిడ్నీ మార్పిడి జరిగాక మాట్లాడుకున్న దాని కంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారని పోలీసులు గుర్తించారు.