AP Congress: అధిష్టానంతో రేపు ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం

AP Congress: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరితే, స్టార్‌ క్యాంపైనర్‌గా కీలక బాధ్యతలు..?

Update: 2023-12-26 13:39 GMT

Congress: అధిష్టానంతో రేపు ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం

AP Congress: అధిష్టానంతో రేపు ఏపీ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహించనుంది. ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో ఏపీ సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తుల పై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేలా నిర్ణయాలను అధిష్ఠానం తీసుకోనుంది. ఇటీవలే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయింది. దీంతో కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిలకు స్టార్‌ క్యాంపైనర్‌గా కీలక బాధ్యతలు..? ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News