Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
*బట్టతో తయారుచేసిన ఫ్లెక్సీలే పెట్టాలని సీఎం జగన్ పిలుపు
Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhra Pradesh: ప్లాస్టిక్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. ఎక్కువ ధర అయినప్పటికీ బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలే పెట్టాలని సూచించారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలవుతోందని, దీనిద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. 2027 నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా అడుగులు పడాలని పిలుపునిచ్చారు సీఎం జగన్.