Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభ – దీపాలతో దివ్య కాంతుల్లో మునిగిన ఆలయాలు

కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతపురం నగరంలో శివకోటి ఆలయం, ఫస్ట్ రోడ్ శివాలయం, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో పాలాభిషేకాలు, రుద్రహోమాలు, కార్తీక దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Update: 2025-11-05 07:09 GMT

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభ – దీపాలతో దివ్య కాంతుల్లో మునిగిన ఆలయాలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దీపపు కాంతులతో ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. వందలాది సంఖ్యలో మహిళాభక్తులు చన్నీటి స్నానాలు ఆచరించి ఆలయాలకు వేకువజామునుండే కూకట్టడంతో పండగ వాతావరణం నెలకొంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌లోని శ్రీరామ చంద్రగోపాల కృష్ణమఠంలో మఠాధిపతి యోగానంద సరస్వతి చేతులమీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో దీపాలు వెలిగించి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిది శ్రీనివాస్ అందిస్తారు.

అనంతపురంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

అనంతపురం నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. నగరంలోని శివకోటి ఆలయం, ఫస్ట్ రోడ్ శివాలయం, పాతూరులోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం పాలాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, రుద్రహోమాలు జరిగాయి. సాయంత్రం పూలంగిసేవ, ప్రాకారోత్సవం, కార్తీక దీపోత్సవం జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. పలు దేవాలయాల వద్ద భక్తులు కార్తీక జ్యోతులను వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాపట్ల జిల్లా చీరాలలోని శివాలయాలకు పోటెత్తిన భక్తులు

బాపట్ల జిల్లా చీరాలలోని శివాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే పరమ శివునికి వివిధ అభిషేకాలు నిర్వహించారు. పేరాల, చీరాల, జాండ్రపేట, రామక్రిష్ణాపురం, ఈపూరుపాలెం శివాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయాల దగ్గర దీపాలను వెలిగించి శివయ్యను స్మరించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్‌లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News