Srisailam Temple: శ్రీశైలంలో ఈనెల 26 నుంచి కార్తీక మాసోత్సవాలు
Srisailam Temple: నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు
Srisailam Temple: శ్రీశైలంలో ఈనెల 26 నుంచి కార్తీక మాసోత్సవాలు
Srisailam Temple: శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈనెల 26 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. కార్తీకమాసం నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఈవో లవన్న.. అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, ప్రభుత్వ సెలవులలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే భక్తుల రద్దీ రోజులలో భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని ఈవో లవన్న తెలిపారు. కార్తీక మాసోత్సవాల నిర్వహణ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, శుద్ధ, బహుళ ఏకాదశులు, కార్తీకమాస శివరాత్రి, ప్రభుత్వ సెలవు రోజుల్లో భక్తులు అధికంగా తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఈవో లవన్న సూచించారు.