hmtv ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో కోటి దీపోత్సవం
hmtv Karthika Deepotsavam 2022: కార్తీక దీపోత్సవానికి పూర్తైన ఏర్పాట్లు
hmtv ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో కోటి దీపోత్సవం
hmtv Karthika Deepotsavam 2022: hmtv ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గంగా బాలత్రిపుర సుందరీ సమేత నాగమల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి.. మేళ తాళాలతో అత్యంత వైభవంగా శివపార్వతుల శోభాయాత్ర జరగనుంది. విశేష ద్రవ్యాలతో నర్మదా బాణలింగానికి మహారుద్రాభిషేకం నిర్వహించనున్నారు. శ్రీశైలం దేవస్థానం వేదపండితులచే అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం జరగనుంది. సమస్త దోషాలను తొలగించి... శుభాలను కలిగించే రుద్రహోమం, మహాపూర్ణాహుతి... ధర్మపురి స్వామీజి, తుని తపోవనం పీఠాధీశ్వురులు పరమపూజ్య పరివ్రాజాకాచార్యులు, శ్రీసచ్చిదానంద సరస్వతి స్వామీజి వారి అనుగ్రహ భాషణం ఉండనుంది.